రామడుగు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన కరీంనగర్ సీపీ గౌస్ ఆలం
కరీంనగర్, జూలై 29 (చైతన్యగళం): కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని రామడుగు పోలీస్ స్టేషన్‌ను బుధవారం పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఆయన, ఆవరణలో పలు కేసుల్లో పట్టుబడి స్వాధీనంలో ఉన్న వాహనాల వివరాలు తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడి వారికి కేటాయించిన విధులపై ప్రశ్నించారు. రికార్డులను సరైన పద్ధతిలో నిర్వహించి, నమోదైన కేసుల వివరాలను సీసీటీఎన్ఎస్‌లో పొందుపరచాలని ఆదేశించారు. తెలంగాణ పోలీసులు టెక్నాలజీ వినియోగంలో భాగంగా అందుబాటులోకి తెచ్చిన సీసీటీఎన్ఎస్–2.0, పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఈ-సమన్లు, టీఎస్-కాప్...