గురుపౌర్ణమి.. ముక్తికి మోక్షమార్గం!
నందికొట్కూరులో ఘనంగా గురుపూజోత్సవాలు.. సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు పాడిపంటలు, ప్రజల సుఖశాంతుల కోసం భక్తుల ప్రార్థనలు నందికొట్కూరు, జూలై 29 (చైతన్య గళం): ఆషాఢ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో గురుపౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గురుపౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా కూడా పిలుస్తారని, గురువును దైవస్వరూపంగా భావించి పూజించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. నందికొట్కూరు పట్టణంతో పాటు సాయిబాబాపేట, బొల్లవరం గ్రామాల్లోని ప్రసిద్ధ శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయాల్లో గురుపూజోత్సవాలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే...