ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు
మహబూబాబాద్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు మహబూబాబాద్(చైతన్యగళం): పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సాయిబాబా స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు భజనలు, సాయినామస్మరణ కార్యక్రమాలు చేపట్టారు. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భక్తుల సాయినామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. అనంతరం భక్తులకు...