లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం
న్యూఢిల్లీ, జూలై 29(చైతన్యగళం): దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు, సంఘటిత అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026కు బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంపొందించడం, అభ్యర్థుల భవిష్యత్తును రక్షించడం, వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడమే ఈ సవరణల ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం వెల్లడించింది. పరీక్షల భద్రతకు మరింత పటిష్ఠ చర్యలు సవరణ బిల్లు ద్వారా ఇప్పటికే అమల్లో ఉన్న చట్టాన్ని మరింత బలోపేతం చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ,...