చెప్పులకు ఏసీ… కడుపుకు కాలుష్యమా?
పంట నుంచి మార్కెట్ వరకు ఆహార నాణ్యతపై నిఘా పెట్టాలి డ్రైనేజీల పక్కన కూరగాయల విక్రయాలను అరికట్టాలి: పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు నరేష్ దండు హైదరాబాద్, జూలై 29(చైతన్యగళం): కాలికి వేసుకునే చెప్పులకు ఏసీ షోరూంలో భద్రత కల్పిస్తున్నాం.. కానీ కడుపులోకి వెళ్లే కూరగాయలు, ఆకుకూరలను మాత్రం డ్రైనేజీల పక్కన, ఫుట్‌పాత్‌లపై, అపరిశుభ్ర వాతావరణంలో విక్రయిస్తున్నారని పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు నరేష్ దండు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కూరగాయల సాగు నుంచి మార్కెటింగ్ వరకు నాణ్యతా ప్రమాణాలను...