మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్నకు ఘన సన్మానం

కరీంనగర్, జూలై 29 (చైతన్యగళం): జలవిహార్ వాకర్స్ అండ్ స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్నను బుధవారం ఘనంగా సన్మానించారు. ఇటీవల అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌతమ్‌నగర్‌లో నిర్వహించిన కట్టమైసమ్మ ప్రత్యేక పూజలు, వనభోజనాల కార్యక్రమానికి ఆయన హాజరై విజయవంతం చేసినందుకు శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అదేవిధంగా రిటైర్డ్ ఎస్సై ఎల్లయ్య గౌడ్, లేక్ పోలీస్ స్టేషన్ ఎస్సై రమేష్, కార్పొరేటర్ కొమురయ్య యాదవ్, పూరుమళ్ల శ్రీనివాస్లను కూడా ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ...