సైబర్ నేరగాళ్ల చేతిలో మున్సిపల్ అధికారి

ఆత్మకూరు, జూలై 28 (చైతన్యగళం): నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో సైబర్ నేరగాళ్లు హల్‌చల్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారిని లక్ష్యంగా చేసుకుని, ఏసీబీ డీఎస్పీ పేరుతో ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి అవినీతి ఆరోపణలు ఉన్నాయని భయపెట్టాడు. ఈ వ్యవహారాన్ని బయటకు రాకుండా చూస్తానంటూ భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడు. నిజమైన కాల్ అని నమ్మిన అధికారి, సైబర్ నేరగాడు చెప్పిన నంబర్‌కు ఫోన్ పే ద్వారా రూ.95 వేల రూపాయలు పంపినట్లు సమాచారం....