అక్రమ కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి
మున్సిపల్ అభివృద్ధికి వినియోగించాలని కౌన్సిలర్ల డిమాండ్ ఆమనగల్లు, జూలై 28 (చైతన్యగళం): ఆమనగల్ మున్సిపాలిటీ శివారులోని సంకటోనిపల్లి పరిధి సర్వే నంబర్-1027లో ఉన్న 4.06 గుంటల ప్రభుత్వ భూమి అక్రమ కబ్జాలో ఉందని, దానిని వెంటనే స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాలకు వినియోగించాలని ఆమనగల్లు మున్సిపల్ కౌన్సిలర్లు మంగళవారం ఎంఆర్వోకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి తోటలు, పంటలు సాగు చేస్తున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుని భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని వారు కోరారు. అనంతరం ఆ స్థలాన్ని పార్కు, కమ్యూనిటీ...