సినీనటి పావలా శ్యామల కన్నుమూత

హైదరాబాద్, జూలై 28 (చైతన్యగళం): ప్రముఖ సినీనటి పావలా శ్యామల (75) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి తర్వాత గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. పావలా శ్యామల గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు. ఆమె పరిస్థితిని తెలుసుకున్న సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్, సాయి దుర్గ తేజ్, దిల్ రాజు తదితరులు గతంలో...