ట్రాఫిక్ పీఎస్ డ్రంకెన్ డ్రైవ్ కేసుల విచారణపై సీపీ గౌష్ ఆలం వివరణ
కరీంనగర్, జూలై 28 (చైతన్యగళం):కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన అంతర్గత విచారణలో అవినీతి వెలుగులోకి వచ్చింది. మే 19న పద్మనగర్‌కు చెందిన బేతి రాజేందర్ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడినప్పటికీ, కోర్టుకు హాజరుకాకుండానే కేసు డిస్పోజ్ అయినట్లు తేలింది. ఈ కేసులో ఆర్ఎస్సై శనిగల శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్ సాయి కృష్ణ, డీడీ డిస్పోసల్ స్టేషన్ కానిస్టేబుల్ కిరణ్‌లు నిందితుడి నుండి రూ.15 వేల లంచం తీసుకుని డూప్లికేట్ కేసు నంబర్ నమోదు చేసి అక్రమంగా కేసును ముగించినట్లు ఆధారాలు బయటపడ్డాయి.సీపీ గౌష్ ఆలం...