శ్రీలంక టెస్టు సిరీస్‌కు భారత జట్టు ప్రకటించిన బీసీసీఐ
న్యూఢిల్లీ(చైతన్యగళం): శ్రీలంక పర్యటనలో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుండగా, సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. అనుభవజ్ఞుడు రవీంద్ర జడేజా తిరిగి జట్టులో చోటు దక్కించుకోగా, యువ ఆటగాళ్లు సారాంశ్ జైన్, గుర్నూర్ బ్రార్ వంటి కొత్త ముఖాలకు కూడా అవకాశం లభించింది. ఈ సిరీస్‌లో భారత జట్టు యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞుల సమన్వయంతో బరిలోకి దిగనుంది. ముఖ్యంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ దృష్ట్యా ఈ సిరీస్ భారత్‌కు ఎంతో కీలకంగా మారనుంది. భారత టెస్టు జట్టు ఇదే.. శుభ్‌మన్ గిల్ (కెప్టెన్)...