CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 11:23 am Posted by : CHAITHANYA GALAM NEWS

శ్రీలంక టెస్టు సిరీస్‌కు భారత జట్టు ప్రకటించిన బీసీసీఐ

న్యూఢిల్లీ(చైతన్యగళం): శ్రీలంక పర్యటనలో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుండగా, సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. అనుభవజ్ఞుడు రవీంద్ర జడేజా తిరిగి జట్టులో చోటు దక్కించుకోగా, యువ ఆటగాళ్లు సారాంశ్ జైన్గుర్నూర్ బ్రార్ వంటి కొత్త ముఖాలకు కూడా అవకాశం లభించింది.

ఈ సిరీస్‌లో భారత జట్టు యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞుల సమన్వయంతో బరిలోకి దిగనుంది. ముఖ్యంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ దృష్ట్యా ఈ సిరీస్ భారత్‌కు ఎంతో కీలకంగా మారనుంది.

భారత టెస్టు జట్టు ఇదే..

  • శుభ్‌మన్ గిల్ (కెప్టెన్)
  • కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్)
  • యశస్వి జైస్వాల్
  • రిషభ్ పంత్ (వికెట్ కీపర్)
  • సాయి సుదర్శన్*
  • దేవదత్ పడిక్కల్
  • ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్)
  • రవీంద్ర జడేజా
  • కుల్దీప్ యాదవ్
  • మనవ్ సుతార్
  • జస్ప్రీత్ బుమ్రా*
  • మహ్మద్ సిరాజ్
  • ప్రసిద్ధ్ కృష్ణ
  • గుర్నూర్ బ్రార్
  • సారాంశ్ జైన్

ఫిట్‌నెస్ క్లియరెన్స్ తర్వాతే ఇద్దరి ఎంపిక

స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యువ బ్యాటర్ సాయి సుదర్శన్ ఎంపికలు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందిన తర్వాతే ఖరారవుతాయని బోర్డు వెల్లడించింది. మరోవైపు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తొలి టెస్టుకు అందుబాటులో ఉండరని తెలిపింది.

టెస్టుల షెడ్యూల్

  • మొదటి టెస్టు: ఆగస్టు 15–19 | గాలే
  • రెండో టెస్టు: ఆగస్టు 23–27 | కొలంబో

అభిమానుల దృష్టి వీరిపైనే!

కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు బుమ్రా ఫిట్‌నెస్, జడేజా పునరాగమనం, యువ ఆటగాళ్ల ప్రదర్శన ఈ సిరీస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. శ్రీలంక గడ్డపై భారత్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా? లేక ఆతిథ్య జట్టు సవాల్ విసురుతుందా? అన్నది ఈ సిరీస్‌లో తేలనుంది.