అమరావతి అంటే 29 గ్రామాలు కాదు..విజయవాడ–గుంటూరుతో కలిసి సమగ్ర అభివృద్ధి: సీఎం చంద్రబాబు

పదేళ్లలో మూడు నగరాలు ఒకే మెట్రోపాలిటన్ ప్రాంతంగా రూపుదిద్దుకుంటాయి.. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణమే లక్ష్యం అమరావతి(చైతన్యగళం): అమరావతి అంటే కేవలం 29 గ్రామాల పరిధి కాదని, విజయవాడ–గుంటూరు–మంగళగిరితో కలిసి అభివృద్ధి చెందే విశాల మెట్రోపాలిటన్ ప్రాంతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణాన్ని గ్రామాలకే పరిమితం చేయకుండా, మొత్తం ప్రాంతాన్ని ఆర్థికాభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అమరావతి భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై మాట్లాడిన సీఎం, రాబోయే పదేళ్లలో అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాలు పరస్పరం అనుసంధానమై...