అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ విజ్ఞప్తి

నిజామాబాద్, జూలై 27 (చైతన్యగళం): నగరంలోని పలు రోడ్లు, వంతెనల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిను కోరారు. సోమవారం హైదరాబాదులోని సచివాలయంలో ఆయనను కలిసి ప్రతిపాదనలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “నగరంలోని దేవీ రోడ్డు, రైల్వే స్టేషన్, నాందేవాడ వంతెన ఆర్‌వోబీ పొడిగింపు పనులు అత్యవసరం. ప్రస్తుతం విజయ థియేటర్, నాందేవాడ వంతెన వద్ద మాత్రమే రైల్వే లైన్ దాటే మార్గాలు ఉన్నాయి. సోనీ ఫంక్షన్ హాల్ సమీపంలోని...