దుర్గాభవానీ అమ్మవారికి బెండకాయల మాలలతో విశిష్ట అలంకరణ
కరీంనగర్ రూరల్ , జూలై 27 (చైతన్యగళం): కరీంనగర్ నగునూర్‌లోని శ్రీ దుర్గాభవానీ ఆలయంలో నిర్వహిస్తున్న ఆషాఢమాస శాకంబరీ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం 13వ రోజు శ్రీ దుర్గాభవానీ అమ్మవారిని బెండకాయల మాలలతో విశిష్టంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పవన్‌కృష్ణ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, విశేష హారతులు సమర్పించారు. బెండకాయల మాలలతో అలంకరించిన అమ్మవారి దివ్యరూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మన్, ఆలయ కమిటీ సభ్యులు, బాధ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలను పొందారు.