హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు బిగ్ షాక్
కమిషనర్ పదవి నుంచి తొలగించాలని సీఎస్‌కు ఆదేశాలు.. కోర్టు ధిక్కరణ వ్యవహారంలో తీవ్ర వ్యాఖ్యలు హైదరాబాద్, జూలై 27(చైతన్యగళం): హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లోతుకుంట భూముల వ్యవహారానికి సంబంధించిన కోర్టు ధిక్కరణ (కాంటెంప్ట్) కేసు విచారణ సందర్భంగా, రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో అర్హత కలిగిన అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ను హైకోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా కోర్టు ఉత్తర్వుల అమలుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం, ఉన్నతాధికారులు న్యాయస్థానాల ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే అది న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను...