కరీంనగర్‌లో మౌలిక వసతుల పనులకు శంకుస్థాపన
కరీంనగర్(చైతన్యగళం): కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే నగర పాలక సంస్థ లక్ష్యమని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. నగరపాలక సంస్థ 2వ డివిజన్ చంద్రపూరి కాలనీ తిలక్‌నగర్‌లో మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ హోదాలో మేయర్ శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం 21వ డివిజన్ శ్రీరాంనగర్ కాలనీలో మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు మరియు సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన చేసి,...