ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రైతుల ఆమరణ నిరాహార దీక్ష

సర్వే నంబర్ 16 రిజిస్ట్రేషన్లు నిలిపివేసి 46 మంది రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ ఆమనగల్లు, జూలై 28 (చైతన్యగళం): ఆమనగల్లు మండలం కోనాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 16 భూముల వివాదం మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది. భూముల రిజిస్ట్రేషన్లను వెంటనే నిలిపివేసి అసలు హక్కుదారులైన 46 మంది రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆమనగల్లు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. సర్వే నంబర్ 16లో 46 మంది రైతులకు భూములు ఉండగా, కొందరి వద్ద పట్టాదారు...