ఆటో కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం
కరీంనగర్, జూలై 27 (చైతన్యగళం): తెలంగాణ ఉద్యమంలో ఆటో కార్మికుల పాత్ర మరువలేనిదని, వారి హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆగస్టు 1న కరీంనగర్‌లో జరగనున్న ఆటో కార్మిక దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వాల్‌పోస్టర్లను ఆవిష్కరించి, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఆటో కార్మికులకు అందించిన సంక్షేమ ఫలాలను, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ఆటో...