డిఏపీ ఎరువుల అక్రమ విక్రయాలపై కాలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బోగ శ్రావణి

జగిత్యాల, జూలై 27 (చైతన్య గళం): జగిత్యాల జిల్లాలో రైతులకు ఎమ్మార్పీ ధర కంటే అధిక ధరలకు డి.ఏ.పీ. ఎరువులు విక్రయిస్తున్న డీలర్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నాయకురాలు డా. బోగ శ్రావణి జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “డి.ఏ.పీ. ఎరువుల ఎమ్మార్పీ ధర రూ.1,350 మాత్రమే ఉన్నప్పటికీ, కొంతమంది డీలర్లు ఒక్కో బస్తాను రూ.1,950 వరకు విక్రయిస్తూ రైతుల నుండి అదనంగా రూ.600 వసూలు చేస్తున్నారు. వ్యవసాయ సీజన్‌లో రైతుల అత్యవసర అవసరాన్ని ఆసరాగా...