కరీంనగర్ టౌన్, జూలై 27 (చైతన్యగళం): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 19వ డివిజన్ పరిధిలోని రేకుర్తి చౌరస్తా వద్ద రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి పైప్‌లైన్ నిర్మాణ పనులకు సోమవారం భూమిపూజ నిర్వహించారు.
15వ ఆర్థిక సంఘం (ఫైనాన్స్ కమిషన్) నిధులతో చేపడుతున్న ఈ పనులకు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్‌తో కలిసి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.