CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 3:43 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ప్రజలకు మెరుగైన పోలీసు సేవలే లక్ష్యం – ఎస్‌హెచ్‌వో ఎస్. వెంకటేశ్వర్లు

  • ఆమనగల్లు ఎస్‌ఐగా సంతోష్ కుమార్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

ఆమనగల్లు, జూలై 27 (చైతన్యగళం): ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించడమే ప్రతి పోలీసు అధికారి ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని అమన్‌గల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో ఎస్. వెంకటేశ్వర్లు అన్నారు. 2020 బ్యాచ్‌కు చెందిన సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎ. సంతోష్ కుమార్ రెడ్డి సోమవారం అమన్‌గల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌హెచ్‌వో ఎస్. వెంకటేశ్వర్లుకు రిపోర్ట్ చేసి విధుల్లో చేరారు. గతంలో చేవెళ్ల, శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్లలో సమర్థవంతంగా సేవలందించిన సంతోష్ కుమార్ రెడ్డికి పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ చట్ట పరిరక్షణ, శాంతిభద్రతల నిర్వహణ, ప్రజా సమస్యలపై సత్వర స్పందనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. స్నేహపూర్వక పోలీసింగ్‌తో పాటు పెండింగ్ కేసుల సత్వర పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆకాంక్షించారు. నూతన ఎస్‌ఐ చేరికతో అమన్‌గల్ పోలీస్ స్టేషన్‌లో పోలీసు సేవలు మరింత సమర్థవంతంగా ప్రజలకు అందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.