తాడిచెర్ల-2 ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి
పెద్దపల్లి, జూలై 27 (చైతన్యగళం): పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, తెలంగాణ రాష్ట్ర గనులు మరియు కార్మిక శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి కలిసి న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గానికి అత్యంత కీలకమైన తాడిచెర్ల-2 బొగ్గు గని ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రాజెక్టు ఆలస్యం కాకుండా త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, ప్రాజెక్టు...