సీపీఎస్ రద్దు – పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం ఉద్యోగుల పోరుబాట
కరీంనగర్, జూలై 27 (చైతన్య గళం): కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) విధానాన్ని తక్షణమే రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలనే ప్రధాన డిమాండ్‌తో తెలంగాణ స్టేట్ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జన జాగరణ కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సంఘం ప్రతినిధులు కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను సానుకూలంగా విన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ, “సీపీఎస్ ఉద్యోగుల పక్షాన అసెంబ్లీలో గళం...