మానవత్వానికి నిదర్శనం.. బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం
హుస్నాబాద్, జూలై 26(చైతన్యగళం): హుస్నాబాద్ పట్టణంలోని 1వ వార్డులో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మంద సదానందంను 1వ వార్డు కౌన్సిలర్ చెన్నబోయిన అనూష విద్యాసాగర్ యాదవ్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇస్తూ తన సొంత నిధుల నుంచి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా సదానందం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, అవసరమైన సహకారం అందిస్తానని విద్యాసాగర్ తెలిపారు. కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వి.వి. రమణ,...