కార్గిల్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
విద్యార్థులు దేశభక్తి స్ఫూర్తితో సైన్యంలో చేరాలి.. వచ్చే ఏడాది నాటికి మహబూబాబాద్‌లో కార్గిల్ స్తూపం నిర్మాణానికి కృషి: ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ మహబూబాబాద్, జూలై 26(చైతన్యగళం): కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలను చేతబూనిన మాజీ సైనికులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు ‘కార్గిల్ అమర జవాన్లకు జోహార్.. జోహార్’, ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం...