CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 9:18 pm Posted by : CHAITHANYA GALAM NEWS

జిల్లావ్యాప్తంగా రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్

నంద్యాల, జూలై 26 (చైతన్యగళం):
జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు తమ పరిధిలోని రౌడీషీటర్లు, నేరచరిత్ర గలవారు, చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.వారిని సత్ప్రవర్తనతో జీవించాలని, నేరప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం వారు జీవిస్తున్న విధానం, జీవనోపాధి గురించి ఆరా తీశారు.“మీపై నిరంతరం నిఘా ఉంటుంది. పోలీసుల మాటలను వినకుండా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్, బైండోవర్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం” అని అధికారులు హెచ్చరించారు.