నంద్యాల జల సంరక్షణకు ప్రధాని ప్రశంసలు

  నంద్యాల (చైతన్యగళం): భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ‘క్యాచ్ ది రైన్’ ప్రచారం కింద నంద్యాల జిల్లా చేపట్టిన జల సంరక్షణ కార్యక్రమాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రశంసించారు. ఈ గుర్తింపు జిల్లా యంత్రాంగానికి గర్వకారణమని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. ప్రధానమంత్రి పేర్కొన్నట్లుగా, జిల్లాలో సంప్రదాయ చెరువుల పునరుద్ధరణ, ఫీడర్ కాలువల పూడికతీత, జల సంరక్షణ నిర్మాణాల బలోపేతం, వర్షపు నీటి సంరక్షణ చర్యలను శాస్త్రీయ ప్రణాళికతో విజయవంతంగా అమలు చేయడం ద్వారా...