CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 9:20 pm Posted by : CHAITHANYA GALAM NEWS

గడివేములలో ఉచిత వైద్య శిబిరం

గడివేముల, జూలై 26 (చైతన్యగళం):
గడివేముల మండలం బిలకలగూడూరు గ్రామంలో నంద్యాల ఇండస్ గుండె హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.గ్రామ ప్రజలకు బీపీ, షుగర్, ఈసీజీ, 2డీ ఎకో, రక్తపరీక్షలు ఉచితంగా చేసి, అవసరమైన మందులు కూడా ఉచితంగా అందజేశారు. ఈ శిబిరంలో దాదాపు 200 మంది తమ ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఇండస్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ వంగాల మనోహర్ రెడ్డి, డాక్టర్ నాగార్జున, గ్రామ నాయకులు ఎస్.ఏ. ఫారుక్, ఎఫ్. నజీర్ అహ్మద్, ఆర్గనైజర్ సి. శివుడు, షేక్ ఆజం, పి. జయంత్ రెడ్డి, ఆంజనేయ రెడ్డి, కె. పాపడు తదితరులు పాల్గొన్నారు.