రైతు పంటలను పరిశీలించిన సిపిఐ(ఎంఎల్) నాయకులు

గడివేముల, జూలై 26 (చైతన్యగళం): గడివేముల మండల పరిధిలోని బిలకలగూడూరు గ్రామంలో ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావంతో మెట్ట రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి షేక్ అబ్దుల్ సలాం పంట పొలాలను పరిశీలించిన అనంతరం తెలిపారు.2026 ఖరీఫ్ సీజన్‌లో రైతులు వర్షాలపై ఆధారపడి మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, పెసర, కంది పంటలకు అధిక పెట్టుబడులు పెట్టి సాగు చేశారని, అయితే వర్షాలు కురవక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పంట నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు రూ.2 లక్షల...