CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 9:20 pm Posted by : CHAITHANYA GALAM NEWS

రైతు పంటలను పరిశీలించిన సిపిఐ(ఎంఎల్) నాయకులు

గడివేముల, జూలై 26 (చైతన్యగళం):
గడివేముల మండల పరిధిలోని బిలకలగూడూరు గ్రామంలో ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావంతో మెట్ట రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి షేక్ అబ్దుల్ సలాం పంట పొలాలను పరిశీలించిన అనంతరం తెలిపారు.2026 ఖరీఫ్ సీజన్‌లో రైతులు వర్షాలపై ఆధారపడి మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, పెసర, కంది పంటలకు అధిక పెట్టుబడులు పెట్టి సాగు చేశారని, అయితే వర్షాలు కురవక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పంట నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని, అలాగే ప్రైవేట్ అప్పుల భారాన్ని తగ్గించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్) జిల్లా నాయకులు ఇస్మాయిల్, షేక్ హుస్సేన్, నాగరాజు, షేక్ సావిదా, కాంతారావు, ప్రవీణ్ కుమార్, కిరణ్ బాబు, సత్యరాజు తదితరులు పాల్గొన్నారు.