కరీంనగర్‌లో భక్తి పారవశ్యం.. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రవచనాలు

కరీంనగర్, జూలై 26 (చైతన్యగళం): కరీంనగర్ నగరంలోని వైశ్య భవన్‌ ఆదివారం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. శ్రీ వరసిద్ధి వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమానికి ప్రముఖ ప్రవచనకర్త, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలను అందించారు. కార్యక్రమానికి విచ్చేసిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును కరీంనగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి గంగుల కమలాకర్ సాదరంగా స్వాగతం పలికారు. పూలమాలలు వేసి, శాలువాతో ఘనంగా సన్మానించి తమ గౌరవాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ, సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి, మానవతా విలువలను సరళమైన భాషలో ప్రజలకు చేరవేస్తూ సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తున్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు సేవలు విశేషమైనవని...