విద్యార్థుల సమైక్య పోరాట ఫలితమే కేంద్ర మంత్రి రాజీనామా
విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలి - లక్ష్మీ నర్సింహారెడ్డి ఆమనగల్లు, జూలై 25 (చైతన్యగళం): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశవ్యాప్తంగా విద్యార్థులు సాగించిన సమైక్య పోరాటానికి దక్కిన విజయమని రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు జి. లక్ష్మీ నర్సింహారెడ్డి పేర్కొన్నారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో చోటుచేసుకున్న లోపాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన ఉద్యమానికి ఈ పరిణామం నైతిక విజయమని అన్నారు. దేశ భవిష్యత్తును నిర్మించే విద్యార్థుల...