CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 6:26 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఘనంగా తొలి ఏకాదశి ఉత్సవాలు

మర్రిగూడ, జూలై 25 (చైతన్యగళం):
మర్రిగూడ మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శనివారం తొలి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఏడాది పొడవునా జరిగే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణించబడుతుంది. వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కావడంతో దీనిని తొలి ఏకాదశిగా లౌకికంగా వ్యవహరిస్తారు.ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం గణపతి పూజ, నగరేశ్వర స్వామికి అభిషేకాలు, కుంకుమార్చనలు, లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. అనంతరం సామూహికంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరిగాయి.అన్నపూర్ణ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవాల్లో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.