ప్రతి బూత్‌లో అర్హులైన ప్రతి ఓటు నమోదు చేయడమే లక్ష్యం – ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

⁠సమన్వయంతో పనిచేసి జూలై 30లోపు ప్రత్యేక సవరణ పూర్తి చేయాలి ఆమనగల్లు, జూలై 25 (చైతన్యగళం): ప్రతి బూత్‌లో అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదు చేయించడం కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం కల్వకుర్తి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల బీఎల్ఏలు (బూత్ లెవల్ ఏజెంట్లు), బూత్ కమిటీ సభ్యులతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పార్టీ బలోపేతం, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ, బూత్ నిర్వహణ, కార్యకర్తల బాధ్యతలపై...