ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలే లక్ష్యం

రూ.25 లక్షల సీసీ రోడ్డు పనులకు శ్రీకారం - ⁠మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్ ఆమనగల్, జూలై 25 (చైతన్యగళం): ఆమనగల్ మున్సిపాలిటీ 6వ వార్డులో గౌరవ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో రూ.25 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్, మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే మున్సిపాలిటీ లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి...