ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత – సర్పంచ్ బొప్పిడి గోపాల్
కడ్తాల్, జూన్ 25 (చైతన్యగళం): ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండాలని, ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు, రావిచేడ్ సర్పంచ్ బొప్పిడి గోపాల్ అన్నారు. శనివారం కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ఆయన హైమావతి దంపతులతో కలిసి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, హారతి కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకుడు శిరీష్ శర్మ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా...