ప్రజాగ్రహానికి ఎవరైనా తల వంచాల్సిందే – బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకుడు దారమోని గణేష్
కల్వకుర్తి, జూలై 25 (చైతన్యగళం): నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో విద్యాశాఖ వైఫల్యం స్పష్టమైందని, విద్యార్థుల విజయం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర సింగ్ ప్రధాన్ రాజీనామాలో ప్రతిఫలించిందని బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకుడు దారమోని గణేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “విద్యార్థులు, యువకులు, విద్యావేత్తలు ఎంతగా కోరినా కేంద్రం పెడచెవిన పెట్టడం వల్ల పరిస్థితి చేయి దాటింది. వాంగ్ చుక్ దీక్ష, కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళన విషయంలో కేంద్రం అనుసరించిన వైఖరి సమంజసం కాదు. విద్యార్థులపై అమానుషంగా ప్రవర్తించడం ప్రతీ భారతీయుడ్ని కదిలించింది....