ఖరీఫ్ బీమా ప్రీమియం చెల్లించాలి – సిపిఐ(ఎంఎల్)
నందికొట్కూరు, జూలై 25 (చైతన్యగళం): నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు మండల పరిధిలో ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావంతో మెట్ట రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు శనివారం పలు గ్రామాల్లో రైతుల పంట పొలాలను పరిశీలించిన అనంతరం తెలిపారు.కిసాన్ మహాసభ, సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పర్యటనలో ఆయన మాట్లాడుతూ, “2026 ఖరీఫ్ సీజన్‌లో రైతులు వర్షాలపై ఆధారపడి మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, మినుము, పెసర, కంది తదితర పంటలను...