CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 6:18 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఖరీఫ్ బీమా ప్రీమియం చెల్లించాలి – సిపిఐ(ఎంఎల్)

నందికొట్కూరు, జూలై 25 (చైతన్యగళం):
నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు మండల పరిధిలో ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావంతో మెట్ట రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు శనివారం పలు గ్రామాల్లో రైతుల పంట పొలాలను పరిశీలించిన అనంతరం తెలిపారు.కిసాన్ మహాసభ, సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పర్యటనలో ఆయన మాట్లాడుతూ, “2026 ఖరీఫ్ సీజన్‌లో రైతులు వర్షాలపై ఆధారపడి మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, మినుము, పెసర, కంది తదితర పంటలను అధిక పెట్టుబడులు పెట్టి సాగు చేశారు. అయితే ఎల్‌నీనో ప్రభావంతో జూలై నెలాఖరు వరకు ఆశించిన వర్షాలు కురవక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు రూ.30,000 నష్టపరిహారం, కౌలు రైతులతో పాటు అందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ, అలాగే ప్రైవేట్ అప్పుల భారాన్ని తగ్గించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.ఈ పర్యటనలో సిపిఐ(ఎంఎల్) మండల కార్యదర్శులు మేకల చంద్రశేఖర్, కాటేపోగు సామన్న, రైతు నాయకులు కె. తిరుపాలు, జాకీర్, నాగశేషులు తదితరులు పాల్గొన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని వారు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు.