కార్గిల్ వీరులకు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఘన సన్మానం

మహబూబాబాద్, జూలై 25(చైతన్యగళం): కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని మహబూబాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం దేశభక్తి ఉట్టిపడేలా నిర్వహించిన కార్యక్రమం విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు కలిసి మానుకోటకు చెందిన కార్గిల్ యుద్ధ వీరులను ఘనంగా సన్మానించి వారి అపూర్వ సేవలను కొనియాడారు. శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, దేశ సరిహద్దులను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన కార్గిల్ యుద్ధ...