అనంతాద్రి ఆలయంలో తొలి ఏకాదశి సందడి
తెల్లవారుజాము నుంచే భక్తుల రాక.. ప్రత్యేక పూజలు, అభిషేకాలతో మారుమోగిన ఆలయం మహబూబాబాద్, జూలై 25(చైతన్యగళం): హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినంగా భావించే తొలి ఏకాదశి సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలోని అనంతాద్రి దేవస్థానంలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి శ్రీమహావిష్ణువును దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొలి ఏకాదశిని శయన ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి ప్రవేశిస్తారని భక్తుల విశ్వాసం....