13వ వార్డులో ప్రజలకు ముప్పుగా మారిన మురికి గుంతలు, భారీ రాళ్లు

వెంటనే తొలగించాలని మున్సిపల్ అధికారులకు కాలనీవాసుల వినతి ఆమనగల్, జూలై 25 (చైతన్యగళం): ఆమనగల్ మున్సిపాలిటీ 13వ వార్డులో జనావాసాలకు ఆనుకుని ఉన్న సర్వే నెం.662/ఆ/2లో లోతట్టు మురికి గుంతలు, భారీ రాళ్లు, కంపచెట్లు ఉండటంతో ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయని వార్డు కౌన్సిలర్ పుల్లారెడ్డి శ్రీశైలం అనూష ఆధ్వర్యంలో కాలనీవాసులు మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్‌కు శనివారం వినతిపత్రం అందజేశారు. వర్షాకాలంలో మురికి నీరు నిల్వ ఉండటంతో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉందని,...