నందికొట్కూరు, జూలై 25 (చైతన్యగళం):
నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని లక్ష్మాపురలో ఉన్న డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో వ్యవసాయ రంగంపై ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 9వ, 10వ తరగతులు మరియు ఇంటర్మీడియట్ విద్యార్థినులకు వ్యవసాయ బోధన అందిస్తున్న ఓకేషనల్ లెక్చరర్ శివపురం నజియా ఆహ్వానం మేరకు దేసి డీలర్ గుజ్జుల గౌరీశ్వర నాయుడు గెస్ట్ లెక్చరర్‌గా హాజరై విద్యార్థినులకు బోధించారు.విద్యార్థినులకు నీటి పొదుపును ప్రోత్సహించే స్ప్రింక్లర్, డ్రిప్ ఇరిగేషన్ (బిందు–తెలికపాటి సేద్యం) ప్రాముఖ్యతను వివరించారు. సూక్ష్మ సేద్య విధానాల వల్ల కలిగే ప్రయోజనాలను స్పష్టంగా తెలియజేశారు. ఆసక్తిగా ప్రశ్నలు అడిగిన విద్యార్థినులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.