కల్వకుర్తిలో ఎఐటియుసి పట్టణ కమిటీ ఎన్నికలు

కల్వకుర్తి, జూలై 25 (చైతన్యగళం‌): నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో శనివారం మధ్యాహ్నం ఎఐటియుసి కార్యాలయంలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ మోటర్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) కల్వకుర్తి పట్టణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎఐటియుసి జిల్లా నాయకుడు పులిజాల పరశురాములు మాట్లాడుతూ, ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎఐటియుసి నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఆటో కార్మికునికి సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు....