కల్వకుర్తి, జూలై 25 (చైతన్యగళం):
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో శనివారం మధ్యాహ్నం ఎఐటియుసి కార్యాలయంలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ మోటర్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) కల్వకుర్తి పట్టణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎఐటియుసి జిల్లా నాయకుడు పులిజాల పరశురాములు మాట్లాడుతూ, ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎఐటియుసి నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఆటో కార్మికునికి సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దేశం సైదులు, ప్రధాన కార్యదర్శిగా ఎస్.కె. అమీర్, ఉపాధ్యక్షులుగా వాకిటి రాజేష్, కటికర్ల సాయిబాబు, ఎడ్ల జనార్దన్, పరశురాం గౌడ్, కోశాధికారిగా జి. మహేష్, సహాయ కార్యదర్శులుగా ఖదీర్, నాగరాజు, శేఖర్ బాధ్యతలు స్వీకరించారు. కమిటీ సభ్యులుగా యాదగిరి, మల్లేష్, లక్ష్మీకాంత్ రెడ్డి, సుదర్శన్, సాయికుమార్, కొండల్, శివ, అంజిలను ఎన్నుకున్నారు.
ఈ ఎన్నికలతో కల్వకుర్తి పట్టణంలో ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి కొత్త కమిటీ కృషి చేయనున్నట్లు నాయకులు తెలిపారు.