యాదగిరిగుట్టలో ఘనంగా ఏకాదశి లక్ష పుష్పార్చన

యాదగిరిగుట్ట, జూలై 25 (చైతన్యగళం‌): శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి ఏకాదశి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులను వివిధ పట్టువస్త్రాలు, బంగారు, వజ్ర వైఢూర్యాలతో దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. ఈ సందర్భంగా సుగంధ పరిమళ పుష్పాలతో లక్ష పుష్పార్చన ఘనంగా చేపట్టారు. పాంచరాత్రాగమానుసారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేదపండితులు, అధికారులు పాల్గొని స్వామివారి కృపను పొందారు.