నీతి అయోగ్ డైరెక్టర్‌నంటూ రూ.1.85 లక్షల టోకరా
ఎస్‌టీ కార్పొరేషన్ లోన్లు ఇప్పిస్తానని మోసం.. నిందితుడి అరెస్ట్ మహబూబాబాద్, జూలై 25(చైతన్యగళం): తాను నీతి అయోగ్ డైరెక్టర్‌నని చెప్పుకుంటూ ఎస్‌టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయిస్తానని నమ్మబలికి పలువురి నుంచి సుమారు రూ.1.85 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన వ్యక్తిని మహబూబాబాద్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.టౌన్ ఇన్‌స్పెక్టర్ రఘుపతి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గూడూరు మండలం చెర్ల తండాకు చెందిన బోడ మహేష్ (36) ప్రభుత్వ పథకాల పేరుతో, ముఖ్యంగా ఎస్‌టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇప్పిస్తానంటూ...