ఎల్‌నినో ప్రభావంపై మూడు జిల్లాల కలెక్టర్లతో మంత్రి సమీక్ష
హుస్నాబాద్, జూలై 23 (చైతన్య గళం): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లతో హుస్నాబాద్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రజలకు చేరవేయాలని మంత్రి సూచించారు. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం వచ్చే జూన్ వరకు వర్షాభావ పరిస్థితులు...