నాటుసారా స్థావరాలపై విస్తృత దాడులు

10 మందిపై కేసులు నమోదు.. 48 లీటర్ల నాటుసారా స్వాధీనం.. 1,200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం మహబూబాబాద్, జూలై 22(చైతన్యగళం): వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కే. నవీన్ కుమార్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని డోర్నకల్ మండలం తెల్లబండ తండాలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు విస్తృత దాడులు నిర్వహించారు. మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్, డీటీఎఫ్ మహబూబాబాద్, వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు సంయుక్తంగా చేపట్టిన ఈ దాడుల్లో 10 మందిపై కేసులు నమోదు చేసి, 48 లీటర్ల నాటుసారాను స్వాధీనం...